కేంద్రానికి సుప్రీం కీలక సూచన

కేంద్రానికి సుప్రీం కీలక సూచన

కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. పన్ను చెల్లించే మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది సొంతింటి కలలు అసంపూర్ణంగానే మిగిలిపోతున్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఈ సందర్భంగా ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. సమస్యల్లో ఉన్న ప్రాజెక్టులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేలా ఓ 'ఫండ్‌'ను ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని సూచించింది.