భీమవరంలో డ్వాక్రా మహిళల ధర్నా
WG: డ్వాక్రా సొమ్ము అవకతవకలపై దర్యాప్తు జరిపి డ్వాక్రా గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో భీమవరంలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆకివీడు డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు ఎస్. ఉదయ్, కుమారి, పద్మ, కళ్యాణి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.