జిల్లాలో భట్రాజుల వన సమారాధన

జిల్లాలో భట్రాజుల వన సమారాధన

ఖమ్మం జిల్లా భట్రాజుల సంఘం ఆధ్వర్యంలో 24వ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం గొల్లగూడెం రోడ్‌లో గల గొల్లసంగయ్య మామిడి తోటలో నిర్వహించిన ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి సంఘం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సరస్వతి పూజ, శివునికి అభిషేకాలు నిర్వహించి, అందరూ ఉల్లాసంగా గడిపారు.