'మాజీ ఎంపీటీసీపై ఆరోపణలు సరికాదు'

'మాజీ ఎంపీటీసీపై ఆరోపణలు సరికాదు'

చిత్తూరు: మాజీ ఎంపీటీసీ అరుణ కుమారిపై ఉషా, సుజన చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లి దళితులు తెలిపారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ఉషా, సుజన తమ గ్రామానికి వచ్చే దారిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారన్నారు.