'బాలల సంరక్షణ కేంద్రాలు ప్రమాణాలు పాటించాలి'

'బాలల సంరక్షణ కేంద్రాలు ప్రమాణాలు పాటించాలి'

హన్మకొండ: జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. బాలల సంరక్షణ కేంద్రాల నిర్వహణ తీరుపై ఈ సమావేశంలో సమగ్ర సమీక్ష జరిగింది.