'రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి'

'రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి'

BDK: మణుగూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా ప్రణాళికలో భాగంగా ఫంక్షన్ హాల్లో ఆరైవ్ అలైవ్ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, స్థానిక ప్రజలకు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.