ప్లాస్టిక్ వాడడంపై కమిషనర్ కఠిన చర్యలు
SRD: నారాయణఖేడ్‌లో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే రూ.5000 జరిమానా విధిస్తామని, ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్‌కు బదులుగా వస్త్ర, జ్యూట్ బ్యాగులను వాడాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.