మరాఠిల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ: DSP
W.G: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భీమవరం, మరాఠీ సంఘం వారి ఆధ్వర్యంలో మావుళ్ళమ్మ గుడిరోడ్డు నుంచి ర్యాలీ ప్రదర్శన గురువారం నిర్వహించారు. DSP రఘువీర్ విష్ణు చత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, ధైర్యానికి, ధీరత్వానికి మారుపేరు శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, మరాఠి నేతలు పాల్గొన్నారు.