కర్నూలు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం

కర్నూలు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం

కర్నూలులోని 21వ వార్డు సంస్కృతి ఉద్యానవనం వద్ద రహదారి ఆక్రమణలపై సోమవారం నగరపాలక సంస్థ ఉక్కుపాదం మోపింది. సర్వే నంబరు 612లో అక్రమంగా నిర్మించిన షెడ్లు, దుకాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వీటిని స్వచ్ఛందంగా తొలగించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో అధికారులే తొలగించి, ఆ ఖర్చులను సదరు యజమానుల నుంచి వసూలు చేస్తామని చెప్పుకొచ్చారు.