అప్పుడే రాజధానిగా విజయవాడ ఉంటే బాగుండేది: సీఎం
NTR: పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందని సీఎం చంద్రబాబు కొనియాడారు. అప్పుడే విజయవాడ రాజధానిగా ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఆవిర్భావంతోనే తెలుగువారిపై 'మదరాసీ' ముద్ర పోయిందని, తెలుగు జాతికి గుర్తింపు దక్కిందన్నారు.