అర్ష్‌దీప్‌ని అందుకే పక్కన పెట్టా: మోర్కెల్
AUSతో 3వ T20లో అదరగొట్టిన అర్ష్‌దీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ తరచూ అతణ్ని పక్కనపెడుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ.. కాంబినేషన్ల కారణంగానే ఇలా జరిగిందన్నాడు. అర్ష్‌దీప్ అనుభవజ్ఞుడని, అతని విలువ తమకు తెలుసని పేర్కొన్నాడు. T20 WC కోసమే ఇదంతా అని చెప్పుకొచ్చాడు.