అరటిలో తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు

అరటిలో తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు

KDP: అరటిలో తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు అరటి పరిశోధన ఉద్యాన శాస్త్రవేత్త రవీంద్ర కుమార్ రైతులకు సూచించారు. సోమవారం లింగాల మండలం మురారి చింతల, బోనాల రైతు సేవా కేంద్రాలలో అరటి రైతులకు సస్యరక్షణ చర్యలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అరటిలో సిగలోక, ఆకుమచ్చ తెగుళ్లు వ్యాపించిన తోటల్లో ఆకులు తగ్గి కాయలు మాగే అవకాశం ఉందని తెలిపారు.