స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తత అవసరం: విజయలక్ష్మి

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తత అవసరం: విజయలక్ష్మి

గుంటూరు జిల్లా ఆరోగ్య అధికారి డా. విజయలక్ష్మి స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం కోరారు. పేడ పురుగు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయని తెలిపారు. జీజీహెచ్‌లో IGM ELISA పరీక్ష అందుబాటులో ఉంది. పొదలు, పొలాల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించాలని సూచించారు.