'ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి'
NLG: తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లు సైదులు-అశ్విని దంపతుల పెద్ద కుమార్తె మనస్విని(2) శనివారం తన తండ్రితో కలిసి యూరియా బస్తాల కోసం ట్రాక్టర్‌లో వెళ్లింది. ఈ క్రమంలో ట్రాక్టర్ రన్నింగ్‌లో ఉండగా సీట్లో కూర్చున్న చిన్నారి అకస్మాత్తుగా జారి పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.