'గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి'

NLG: గ్రంథాలయాల అభివృద్ధి కోసం గ్రంథపాలకులు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఎం.ఎ.హఫీజ్ ఖాన్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన సమీక్షా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌కు, కార్యదర్శి బాలమ్మకు సిబ్బంది సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథపాలకులు పాల్గొన్నారు.