VIDEO: ఎన్నికల కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు సిద్ధం
GDWL: అయిజ మండలంలో రేపు జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 15 రూట్లు ఏర్పాటు చేసి, సిబ్బందిని తరలించేందుకు బస్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు మరికొద్దిసేపట్లో గ్రామాలకు బయలుదేరనున్నట్లు ఎంపీడీవో భాస్కర్ తెలిపారు.