VIDEO: మంజీరాలో అక్రమ ఇసుక రవాణా
KMR: బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం గ్రామస్థులతో కలిసి సర్పంచ్ ధర్మ తేజ మంజీరా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను అడ్డుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం చెక్ డ్యాం నిర్మాణానికి డంప్ చేసిన ఇసుకను వివిధ కాంట్రాక్టర్లు రాత్రింబవళ్లు అక్రమంగా తరలిస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.