పాత గుంటూరులో రేషన్ బియ్యం పట్టివేత
GNTR: పాత గుంటూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇవాళ ఉదయం ఆంజనేయస్వామి గుడి సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ వాహనంలో తరలిస్తున్న 2.75 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 55 బస్తాల బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.