'ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తుంది'

WGL: నల్లబెల్లి మండలం కొండైలుపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి రైతు రామారావుకు మంజూరైన గొర్రెల ఫామ్ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.