VIDEO: మైదుకూరులో మహిళ మృతి.. RMP క్లినిక్ సీజ్
KDP: మైదుకూరులోని RMP క్లినిక్ లను DMHO భారతి తనిఖీ చేశారు. కడప రోడ్డులోని RMP క్లినిక్లో వైద్యం పొందిన మహిళ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. అధికారుల స్పందించి తనిఖీలు చేపట్టారు. DMHO మాట్లాడుతూ.. అర్హత గల వైద్యుల వద్దనే చికిత్స పొందాలన్నారు. RMPలు వైద్య పరీక్షలు చేస్తే చర్యలు తప్పవన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓ క్లినిక్‌ను సీజ్ చేశారు.