కాంగ్రెస్ నేతల ఇళ్లన్నీ ఎఫ్‌టీఎల్‌లోనే: KTR
TG: కాంగ్రెస్ నేతల ఇళ్లపై KTR తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'రెడ్డికుంటలోని రేవంత్ రెడ్డి ఇల్లు FTL పరిధిలోనే ఉంది. ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా FTL పరిధిలోనే ఉంది. మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. వివేక్ ఇల్లు కూడా చెరువులోనే ఉంది కదా. బఫర్ జోన్ నిబంధనలు కేవలం పేదలకు, మధ్యతరగతి ప్రజలకే ఉంటాయా? కాంగ్రెస్ నేతలకు వర్తించవా?' అంటూ నిలదీశారు.