దాచేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

దాచేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

PLD: దాచేపల్లి సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల మార్గంలోని పెట్రోల్‌ బంకు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని చికిత్స కోసం దాచేపల్లి ఆస్పత్రికి తరలించారు. బాధితుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.