నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం
జన్నారం మండలంలోని కవ్వాల్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా లకావత్ సక్రు నాయక్ ఘన విజయం సాధించారు. దీంతో బంగారు తండా యూత్ సభ్యులు శుక్రవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. మిఠాయి తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సక్రు నాయక్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించారని తెలిపారు.