VIDEO: MRO ఆఫీస్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
WGL: వర్ధన్నపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డుల గదిని పరిశీలించి, నిర్వహణ ప్రమాణాలపై అధికారులతో చర్చించారు. విధులు నిర్వహిస్తున్న అధికారుల కార్యకలాపాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలపై ఆరా తీశారు.