బాపట్ల పోలేరమ్మ ఆలయానికి కొత్త కళ
BPT: బాపట్ల గ్రామ అధిష్టాన దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ నామల వెంకట శివ నారాయణ పాల్గొని శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.