రెండురోజులుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం
MNCL: చెన్నూరు పట్టణంలో రెండురోజులుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్తు నిలిచిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అయిదు నెలల కిందట విద్యుత్తుశాఖ ఏఈ బదిలీ కాగా, బీమారం ఏఈకి చెన్నూరు అదనపు బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గ కేంద్రమైన చెన్నూరులో అయిదు నెలలుగా ఏఈ పోస్టు ఖాళీగా ఉండటం గమనార్హం.