విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి
RR: బాలాపూర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. వాడి-యే-ముస్తాఫా ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ (29) అనే వ్యక్తి తన ఇంట్లోని వాటర్ మోటార్ వైరును రిపేర్ చేస్తుండగా విద్యుత్‌షాక్ గురై మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.