గుండెపోటుతో గర్భిణీ మృతి

NLR: జిల్లాలోని చలపతి నగర్‌కు చెందిన వెంకటరమణమ్మ గుండెపోటుతో మృతి చెందింది. 9 నెలల గర్భిణిగా ఉన్న వెంకటరమణమ్మకు షుగర్, థైరాయిడ్, బీసీ వంటి సమస్యలు ఉన్నాయి. రాత్రి గుండెల్లో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వేదాయపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.