పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

BDK: అశ్వాపురం మండల కేంద్రంలో జరుగుతున్న మొదటి విడత పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇవాళ పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎవరు ప్రయత్నించిన తనకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.