VIDEO: 'రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న BJP, RSS'

MNCL: బెల్లంపల్లి పట్టణం MD ఖాసీం బస్తీలో CPI పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా CPI రాష్ట్ర నాయకురాలు బొల్లం పూర్ణిమ అరుణ పతాకం ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాటాకి RSS, BJPలు మతం రంగు పులుముతున్నాయని ఆరోపించారు. భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటమన్నారు.