కుప్పంలో వ్యక్తి ఆత్మహత్య

CTR: కుప్పం రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ ఎదుట లాల్బాగ్ రైలు వచ్చే సమయంలో రైలు పట్టాలపై పడుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా తల మొండెం రెండుగా తెగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.