VIDEO: తాళాలు పగలగొట్టి సెల్ షాపులో చోరీ..!
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని కృష్ణా టాకీస్ సమీపంలో ఉన్న సెల్ షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు షాపుకు వేసిన తాళాలను పగలగొట్టి మూడు టచ్ ఫోన్లను, రూ.10 వేల నగదు, మూడు ఇయార్ బడ్స్‌ను చోరీ చేశారని నిర్వాహకులు తెలిపారు. షాపు యజమాని జగదీష్ ఆదివారం షాపు తీసేందుకు వచ్చినప్పటికి తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.