డిసెంబర్ 1 నుంచి D.Ed పరీక్షలు

డిసెంబర్ 1 నుంచి D.Ed పరీక్షలు

NRML: డిసెంబర్ 1 నుంచి తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో D.Ed మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో భోజన్న శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్మల్ కస్బా ప్రభుత్వ హై స్కూల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయని, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.