కావలి మున్సిపల్ ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు!
NLR: కావలి మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో భారీ అవినీతి జరుగుతోందని కార్మికులు ఆర్డీవో ఎం. సన్నివంశీకృష్ణకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన సిబ్బంది వారసులకు ఉద్యోగాలివ్వకుండా, అధికారులే లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.