ఆర్థిక పరిస్థితి గురించి చెబితే తప్పేంటి?: సీతక్క

TG: BRS అధినేత KCRపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. 'కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడే అయితే పత్తా లేకుండా ఎందుకు పోయాడు. మీటింగులకు వచ్చి తిడతాడు కానీ, అసెంబ్లీకి మాత్రం రాడు. కేసీఆర్ ఇంకా దొర అనే భావనతో ఉండి ఫామ్‌హౌసే పరిపాలన కేంద్రం అనుకుంటున్నాడు. పదేళ్లలో KCR ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఉన్నది ఉన్నట్లు చెబితే తప్పేముంది?' అంటూ మండిపడ్డారు.