పంచాయతీ ప్రత్యేక అధికారి బాధ్యతలు స్వీకరణ
AKP: నాతవరం పంచాయతీ ప్రత్యేకాధికారిగా తహసీల్దార్ చందనరేఖ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామంలోని పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.