రూ. 5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు
KRNL: కర్నూల్ ఉపాధి కల్పన కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి దీప్తి తెలిపారు.. ఈ సందర్భంగా నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీఐ, డిప్లొమా విద్యార్థులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు.