ఉచిత పూల మొక్కల పంపిణీ కార్యక్రమం

కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బురుజు వద్ద పట్టణ ప్రజలకు జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ సంగం అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో పూల మొక్కలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో వాయు కాలుష్యం పెరుగుతుందని, కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు.