ప్రశాంతంగా ముగిసిన డిగ్రీ పరీక్షలు

ప్రశాంతంగా ముగిసిన డిగ్రీ పరీక్షలు

ప్రకాశం: పామూరులోని వివేక ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెండో సంవత్సరం నాల్గవ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. స్టాటిస్టిక్స్, జాగ్రఫీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ పరీక్షలకు మొత్తం 171 మందిలో 138 మంది హాజరుకాగా, 33 మంది గైర్హాజరయ్యారు.