పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

KNR: చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాల 2008 - 10 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమ్మేళనంలో విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు నెవూరి ప్రేమ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.