మిట్స్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అన్నమయ్య: అంగల్లో సమీపంలోని మిట్స్ డీమ్డ్‌టుబి యూనివర్సిటీ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ఛాన్స్‌లర్, ఫౌండర్ డా: యన్ విజయభాస్కర్ చౌదరి పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగమూర్తుల వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. అనంతరం వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.