ఎదులాబాద్ చెరువు కట్టపై రోడ్డు నిర్మించాలని డిమాండ్..!
MDCL: ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాలలో అతిపెద్ద చెరువు అయిన ఏదులాబాద్ చెరువు కట్టపై రోడ్డు నిర్మించాలని అక్కడి ప్రజలు, పర్యటకులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు కట్టపై రోడ్డు నిర్మించి, పరిసరాలు అద్భుతంగా మారిస్తే, ఓ పచ్చని హరివిల్లులా మారే అవకాశం ఉంటుందని, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఎదులాబాద్ సొంతం అంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.