'ప్రజా సమస్యల పరిష్కారంలో విలేకరులదే కీలక పాత్ర'

TPT: ప్రజా సమస్యల్లో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. నేడు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా ఆమె నియోజకవర్గ పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులు నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆమె కొనియాడారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.