VIDEO: రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారు ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. ఇవాళ స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలికొండ గ్రామానికి చెందిన ఓదెల హంసరాజు, జ్యోతి దంపతులు బైక్‌పై వర్ధన్నపేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన్నట్లు తెలిపారు.