'మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఫిర్యాదులేవీ లేవు'

'మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఫిర్యాదులేవీ లేవు'

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌పై ఫస్ట్ ఇయర్ విద్యార్థుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేవని ఇవాళ ప్రిన్సిపాల్ డా. చిట్టి నరసమ్మ తెలిపారు. ర్యాగింగ్ అంశంపై వచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. ఫస్ట్ ఇయర్, సీనియర్ విద్యార్థులను వేర్వేరు హాస్టళ్లలో ఉంచుతున్నట్లు వివరించారు. ర్యాగింగ్ నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.