బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మార్కండేయ కాలనీకి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణ పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సోమవారం పరిశీలించారు. మూల మలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న రోడ్డును ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సోదరుడు, ఏఎంసీ ఛైర్మన్ ప్రకాశ్ రావు, మున్సిపల్ ఛైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు.