'యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి'
SKLM: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన భవనంలోని గ్రౌండ్ నుంచి మూడో అంతస్తు వరకు అన్ని విభాగాలను కలియ తిరిగారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తిచేయాలని ఆయన అధికారులని ఆదేశించారు.