అంగన్వాడి సెంటర్ లో హోలీ వేడుకలు

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 7లో పోషన్ పక్వాడ ముగింపు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా హోలీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్దలు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఏ.కవిత మాట్లాడుతూ.. పోషకాహారంపై అవగాహన, చిరుధాన్యాల ప్రాముఖ్యత తెలియజేయడం జరిగిందని తెలిపారు.