'పథకం పేరు మార్పునకు బదులు ప్రజల జీవితాలను మార్చాలీ'
SRD: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు బదులు ప్రజల జీవితాలను మార్చాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి అన్నారు. మండల పరిధి ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. 200 రోజులు పని దినాలు, రోజు కూలీ రూ. 800 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.