ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BDK: పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని మహిళలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వానికి భిన్నంగా నాణ్యమైన చీరలు అందించి పేద మహిళల సామాజిక గౌరవం పెంపొందే దిశగా నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమైనదని కొనియాడారు.